D Educt: Aug 21: విద్యా హక్కు చట్టం (RTE) కింద 2022-23 నుంచి 2026-27 వరకు ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1.04 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారని మంత్రి నారా లోకేశ్‌ ఆగస్టు 20న శాసనమండలిలో తెలిపారు. ఈ ప్రవేశాల ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాహక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 2022-23లో కేవలం 2,203 మంది విద్యార్థులు మాత్రమే ఆర్‌టీఈ కింద ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రవేశాలు పొందగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు.

2024-25 విద్యా సంవత్సరంలో సుమారు 29 వేల మంది విద్యార్థులకు, 2026-27లో 28,742 మంది విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు లభించాయని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రవేశాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ వైకాపా సభ్యులు వరుసగా నాలుగో రోజు శాసనమండలి కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మధ్య సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మిగిలిన ప్రశ్నలకు కూడా మంత్రులు సమాధానాలు ఇచ్చినట్లుగా భావించాలని ఛైర్మన్‌ ప్రకటించారు.

1/70 భూ బదిలీ నియంత్రణ చట్టంపై ప్రభుత్వం స్పష్టత

గిరిజన ప్రాంతాల్లో అమల్లో ఉన్న 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టాన్ని సవరించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రి సంధ్యారాణి శాసనమండలిలో స్పష్టం చేశారు. చట్ట సవరణ కోసం కొందరు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించే 1/70 చట్టాన్ని సమర్థించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేత

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) ఆదేశాల నేపథ్యంలో కొన్ని పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 2021 జులై 7 నుంచి నిలిచిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.922 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో మట్టి పనులకు రూ.527.72 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు రూ.395.21 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వివరించారు.

గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ, చెన్నైతో పాటు రాయలసీమ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశను చేపట్టినట్లు 2023 ఆగస్టు 11న గత ప్రభుత్వం జీవో నంబర్‌ 64ను విడుదల చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పర్యావరణ అనుమతులు, సంబంధిత అంశాల కారణంగా పనులు నిలిచిపోయినప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన వ్యయం, గత ప్రభుత్వ నిర్ణయాల వివరాలను శాసనమండలిలో వెల్లడించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana