
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
సినిమా ఫస్టాఫ్ సహజంగా, క్లీన్‌గా సాగుతుందని.. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ సమయానికి కథనం వేగం పుంజుకుంటుంది. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో లాజిక్ పరంగా చిన్న లోపాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేదని టాక్.
త్రినాథ్ పాత్రలో రవితేజ తన నటనతో ఆకట్టుకున్నారని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. తన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కాకుండా పాత్రకు అనుగుణంగా నటించి మెప్పించారని అంటున్నారు.
సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామా, ట్విస్టులను దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉందని టాక్.
‘మల్లెపూల పల్లకి’ పాటతో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ లభించినట్లు సమాచారం. మొత్తంగా థ్రిల్లర్ అంశాలతో పాటు ఎమోషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ఓవర్సీస్ ప్రేక్షకుల స్పందన చెబుతోంది.
కథను నమ్మి రవితేజ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, శివ నిర్వాణ దర్శకత్వం, రవితేజ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రాథమిక టాక్.
