జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్‌వే నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బస్సు రూట్లను మార్చడంతో పాటు స్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రయాణికులు మారిన రూట్లు, స్టాప్‌లకు అనుగుణంగా తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మారిన ప్రధాన బస్సు రూట్లు:

బస్సు నంబరు 47 ఎల్‌ రాకపోకలు

సికింద్రాబాద్‌ నుంచి మణికొండ : సికింద్రాబాద్‌- బేగంపేట- నాగార్జున సర్కిల్‌ – ఎల్‌వీ ప్రసాద్‌- బసవతారకం హాస్పిటల్‌- బీఆర్‌ఎస్‌ భవన్‌- ఎమ్మెల్యే కాలనీ- ఒమేగా- అపోలో ఆస్పత్రి- ఫిల్మ్‌నగర్‌- దర్గా- మణికొండ

మణికొండ నుంచి సికింద్రాబాద్‌: మణికొండ- పంచవటికాలనీ, దర్గా- ఫిల్మ్‌నగర్‌ – జర్నలిస్ట్‌ కాలనీ- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్‌ హాస్పిటల్‌- టీవీ9 (మసీద్‌)- పంజాగుట్ట పీఎస్‌- ఆర్‌జే కాలేజీ- పోలీస్‌ లైన్‌- ప్లాజా- సికింద్రాబాద్‌.

బస్సు నంబరు 222

కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి- లక్డీకాపూల్‌- మాసబ్‌ట్యాంక్‌- నాగార్జున సర్కిల్‌- ఎల్‌వీ ప్రసాద్‌- బసవతారకం హాస్పిటల్‌- బీఆర్‌ఎస్‌ భవన్‌- ఎమ్మెల్యే కాలనీ-ఒమేగా- ఆపోలో ఆస్పత్రి- జర్నలిస్ట్‌ కాలనీ- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌- పెద్దమ్మగుడి – మాదాపూర్‌ పీఎస్‌- పటాన్‌ చెరు.

పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు- మాదాపూర్‌ పీఎస్‌- పెద్దమ్మగుడి- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్‌- నాగార్జున సర్కిల్‌- మాసబ్‌ట్యాంక్‌ – లక్డీకాపూల్‌- కోఠి

బస్సు నంబరు 127

కోఠి నుంచి కొండాపూర్‌ : కోఠి- లక్డీకాకపూల్‌ – మాసబ్‌ట్యాంక్‌- పెన్షన్‌ ఆఫీస్‌ – ఎమ్మెల్యే కాలనీ- అపోలో ఆస్పత్రి- రోడ్డు నంబర్‌ 45 – మాదాపూర్‌ పీఎస్‌- కొండాపూర్‌.

కొండాపూర్‌ నుంచి కోఠి : కొండాపూర్‌- మాదాపూర్‌ పీఎస్‌- రోడ్డు నంబరు 45- జర్నలిస్ట్‌ కాలనీ- జూబ్లీహి ల్స్‌ చెక్‌పోస్ట్‌- అన్నపూర్ణ స్టూడియో – ఎల్‌వీ ప్రసాద్‌- బసవతారకం హాస్పిటల్‌ – బీఆర్‌ఎస్‌ భవన్‌- ఎమ్మెల్యే కాలనీ – పెన్షన్‌ ఆఫీస్‌- మాసబ్‌ట్యాంక్‌ – కోఠి.

బస్సు నంబరు 10 హెచ్‌

సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ :

సికింద్రాబాద్‌- బేగంపేట- మైత్రివనం- యూసుఫ్ గూడ ఎక్స్‌రోడ్‌- వెంకటగిరి- నవయుగా – పెద్దమ్మగుడి- మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌ – కొండాపూర్‌.

కొండాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌:

కొండాపూర్‌- పెద్దమ్మగుడి- జూబ్లీచెక్‌ పోస్టు- వెంకటగిరి – యూసుఫ్ గూడ- మైత్రివనం-బేగంపేట- సికింద్రాబాద్‌.

By Rajini

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana