తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం KNRUHS మరోసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. NEET UG-2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అర్హులైన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్
MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అవసరమైన ధ్రువపత్రాల అప్లోడ్ ప్రక్రియ ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే KNRUHS నిర్వహించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దరఖాస్తు పూర్తి చేసి, అప్లికేషన్ సమర్పించిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విశ్వవిద్యాలయం తెలిపింది.
అర్హత ఉన్నప్పటికీ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన NEET UG-2026 అభ్యర్థులు ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కన్వీనర్ కోటా కింద తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో MBBS, BDS ప్రవేశాల తదుపరి ప్రక్రియకు ఈ రిజిస్ట్రేషన్ కీలకం కానుంది.
