80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🇮🇳
ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలో అపారమైన త్యాగాలు చేసి దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిన మహనీయులకు వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. అదే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. వారు కలలుగన్న సమాజాన్ని నిర్మించడమే వారికి మనం అందించగల నిజమైన, గొప్ప నివాళి.
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించాను.


అనంతరం ఎంపీ కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఎల్ నాగరాజు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాను.తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండున్నరేళ్లలో చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి వివరించాము.ప్రభుత్వం కొందరి చేతుల్లో ఉండే అధికారం కాదు.. ప్రజలందరితో కలిసి పనిచేసినప్పుడే ప్రజా ప్రభుత్వం నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో యువత, మహిళలు, రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్నాం.




ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు పేదలకు సంక్షేమ పాలన అందిస్తూ ప్రజా ప్రభుత్వం రెండు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి చెందిన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సత్కరించే అవకాశం లభించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా వీక్షించాను. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి బ్యాడ్జీలు, వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశాము.అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
