మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశాను. అనంతరం పరేడ్‌లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించాను. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. డా.బీఆర్‌ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేశారు

ప్రత్యేక తెలంగాణ సాధన కోసమూ ఎందరో బలిదానాలు చేశారు. సబ్బండ వర్గాలు ఉద్యమించాయి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా సమాజంలో ఇంకా కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు వేళ్లూనుకుని ఉండటం బాధాకరం. నేటి యువతలో కొందరు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. సమాజంలో నేరాలు, ఘోరాలు, దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్వాతంత్ర్య భారతం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఎన్నో కలలను సాకారం చేసుకున్నాం

ప్రత్యేక తెలంగాణ సాధన కోసమూ ఎందరో బలిదానాలు చేశారు. సబ్బండ వర్గాలు ఉద్యమించాయి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా సమాజంలో ఇంకా కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు వేళ్లూనుకుని ఉండటం బాధాకరం. నేటి యువతలో కొందరు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. సమాజంలో నేరాలు, ఘోరాలు, దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్వాతంత్ర్య భారతం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఎన్నో కలలను సాకారం చేసుకున్నాంఅయితే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తోంది. పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం

By Hemanth