D Educt: Aug 13: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 267 అసిస్టెంట్, క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌లో 15 పోస్టులు, శ్రీహరికోటలో 49 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ లేదా సంబంధిత కోర్సులో ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 16.08.2026 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టులు, అర్హతలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పరిశీలించుకోవాలి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 16లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.