హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతం పేరుకు వందల ఏళ్ల చరిత్ర ఉందనే విషయం తెలుసా..? నిజాం రాజుల వద్ద 1670 ప్రాంతంలో దివాన్‌గా పని చేసిన రజా అలీఖాన్‌ అనే వ్యక్తికి నేఖ్‌నామ్‌ ఖాన్‌ అనే బిరుదు ఉండేదట. ఆయనకు ఇచ్చిన జాగీర్‌ ప్రాంతాన్ని నేక్‌నామ్‌ ఖాన్‌పల్లిగా పిలిచేవారని కాలక్రమంలో అది నాంపల్లిగా మారిందని చారిత్రక కథనాల ద్వారా వెల్లడైంది. మరోవైపు నామ్ అంటే ఊర్దులో తేమ అని పల్లి అంటే జాగా అని ఆ ప్రాంతం తేమగా ఉండటం వల్ల నాంపల్లి అనే పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో నాంపల్లి ఒకటి. నాంపల్లి రైల్వే స్టేషన్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ వంటివాటితో నగర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల పేర్ల వెనుక నిజాం కాలం నాటి వ్యక్తులు, జాగీర్లు, గ్రామాలు, స్థానిక భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన కథలు ఉన్నాయి. నాంపల్లి పేరు విషయంలోనూ ప్రధానంగా ఒక చారిత్రక కథనం ప్రచారంలో ఉంది.

చారిత్రకంగా ప్రాచుర్యంలో ఉన్న వివరాల ప్రకారం.. 1670లో రజా అలీఖాన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌ రాజ్యాన్ని పాలించిన నిజాం పాలకుల దర్బార్‌లో దివాన్‌గా పనిచేశారు. ఆయనకు ‘నేక్‌నామ్‌ ఖాన్‌’ అనే బిరుదు ఉండేది. ఆయనకు జాగీర్‌గా ఇచ్చిన ప్రాంతాన్ని నేక్‌నామ్‌ ఖాన్‌పల్లిగా పిలిచేవారని.. కాలక్రమంలో ఆ పేరు కాస్తా నాంపల్లిగా మారిందని పలు చరిత్ర ఆధారిత కథనాలు పేర్కొంటున్నాయి. నాంపల్లి పేరుకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ ప్రాంతం గతంలో తేమగా, నీటి వనరులతో కూడిన ప్రదేశంగా ఉండేదని, అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పేరు ఏర్పడిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఉర్దూలో నామ్‌ అంటే తేమగా ఉండే ప్రదేశమని.. పల్లి అంటే జాగా అని.. ఆ ప్రదేశం ఎప్పుడూ తడిగా తేమతోకూడిన జాగాగా ఉండటంతో దాన్ని ‘నాంపల్లి’ ప్రాంతంగా పిలిచే వారని కథనం కూడా ఉంది.

నాంపల్లి పేరు వెనుక ఉన్న కథ ఏదైనా.. హైదరాబాద్‌ నగరం ఎలా విస్తరించిందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంత చరిత్ర ఒక మంచి ఉదాహరణ. ఒకప్పుడు జాగీర్‌, గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతంగా ఉన్న నాంపల్లి.. కాలక్రమంలో హైదరాబాద్‌ నగరంలో కీలక వాణిజ్య, రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ స్టేషన్‌ 1907లో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మించారు. పర్షియన్, దిల్లీ మిక్స్‌డ్‌ దక్కనీ స్టైల్‌ ఆర్కిటెక్చర్‌‌తో స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana