తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగానికి పైగా హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు వెల్లడైంది. ఇక నేటితో ఎస్ఐఆర్ గడువు ముగియడంతో ఇప్పుడు ఫారాల పరిశీలన, ధ్రువీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితా ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించేందుకు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 71 లక్షల మంది ఓటర్ల వివరాలపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఓటర్లను అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలో గుర్తించిన నేపథ్యంలో.. తుది ఓటర్ల జాబితాలో వీరి పేర్లు కొనసాగుతాయా లేక తొలగిస్తారా అనేది కీలకంగా మారింది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సుమారు 70.8 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫారాలు అందుబాటులో లేని లేదా సేకరించలేని కేటగిరీలో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

ఈ సంఖ్య రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 21 శాతానికి సమానమని ఎన్నికల సంఘం గణాంకాలు పేర్కొంటున్నాయి. వీరిలో సుమారు 9.1 లక్షల మంది మరణించినవారు ఉండగా.. 10.3 లక్షల మంది గైర్హాజరు లేదా ఆచూకీ లభించని వారిగా గుర్తించారు. మరో 43 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు.. 6.6 లక్షల మంది డూప్లికేట్‌ ఓటర్లుగా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలోకి వచ్చే ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియ ఉంటుందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గడువు ముగియగా.. ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి మరిన్ని ఎన్యుమరేషన్‌ ఫారాలు అందే అవకాశం ఉండటంతో తుది తొలగింపు సంఖ్యలో మార్పు రావచ్చని భావిస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నాటికి సుమారు 3.2 లక్షల ఫారాలు మాత్రమే డిజిటలైజ్‌ కావాల్సి ఉండగా.. మిగిలిన ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు.

ఎస్‌ఐఆర్‌లో అత్యధికంగా అన్‌కలెక్టబుల్‌ ఫారాలు నమోదైన ప్రాంతంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం నిలిచింది. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి సుమారు 41.5 లక్షల అన్‌కలెక్టబుల్‌ ఫారాలు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70.8 లక్షలతో పోలిస్తే ఇవి దాదాపు 58.6 శాతానికి సమానం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana