ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి.

తెల్లవారుజామున అమీన్ తన పోర్షే కారులో మిత్రుడితో కలిసి గిండి వైపు వెళ్తున్నారు. ఒలంపియా టెక్ పార్క్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఉదయం 3.30 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారును వాగాన్ ఆర్ కారు ఢీకొట్టింది. దీంతో అమీన్, ఆయన మిత్రుడికి గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే ఇద్దరినీ చికిత్స కోసం కావేరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అమీన్, ఆయన మిత్రుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. మరోవైపు వాగాన్ ఆర్ కారులో ఉన్న వ్యక్తికి కూడా గాయాలు కావడంతో కళైంగర్ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయనను కూడా డిశ్చార్జ్ చేశారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By Rajini