బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి బీవోబీ అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.

ఖాళీలు ఇలా..
డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో 19, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో 88, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో 16, సెక్యూరిటీలో 54, ఎంటర్‌ప్రైజ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌లో 14, కార్పొరేట్‌ అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ ప్లానింగ్‌లో 15 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు
పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ లేదా సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 23 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పని విభాగంలో పోస్టును బట్టి 2 నుంచి 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత సైకోమెట్రిక్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. కొన్ని పోస్టులకు గ్రూప్‌ డిస్కషన్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు ఫీజు
జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.175గా నిర్ణయించారు.

జీతం
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300 వరకు జీతం లభించనుంది.

By Ramya