
శ్రీలంక పర్యటనను ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0) డకౌట్‌తో మొదలెట్టాడు. వామప్ మ్యాచ్‌లో సున్నాకే వెనుదిరిగాడీ హిట్టర్
శ్రీలంక పర్యటనను టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డకౌట్‌తో ప్రారంభించాడు. కొలంబో వేదికగా జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్ రెండో బంతికే జైస్వాల్ (0) పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక బౌలర్ దులిమ్ సుదీర వేసిన బంతికి ఔటైన యశస్వీ.. ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.
జైస్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (8), దేవదత్ పడిక్కల్ (15) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ 23/1తో కొనసాగుతోంది.
అంతకుముందు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టు తరఫున నిషాన్ మదుష్క (66), రవీందు రసంత (71), సోనాల్ దినుష (52) అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు భారత్‌పై భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 340 పరుగుల వెనుకంజలో ఉంది.
