D News: Aug 7: భారీ వర్షాలు: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు వర్షాల ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని 15 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు చేయాలని, రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana