D News: Jul 31: పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా జీవితంలోనూ రాజకీయ రంగంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఆయన ప్రజల కోసం చేసిన కృషి, రాజకీయాల్లో చూపిన అంకితభావం ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అలాంటి అంకితభావం కలిగిన నాయకుడి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ సమాజానికి తీవ్ర విషాదమని అన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని లోటును తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఆకాంక్షించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana