D news: Jul 30: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ వాయిదా: హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద గతంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణను నాంపల్లి కోర్టు ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ముగ్గురు నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు వారి న్యాయవాదులు వివరించారు. ఇదే కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.

విచారణ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల కాపీలను పోలీసులు ఇప్పటివరకు అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం పోలీసులను వివరణ కోరుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణ నాటికి ఛార్జ్‌షీట్‌లో ఉన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, ఇతర సంబంధిత పత్రాల కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు అందించాలని కోర్టు పోలీసులను స్పష్టంగా ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana