
DNews: May04: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇందులో, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో బీజేపీకి ఉన్న బలం సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు, అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. దీంతో సూచీలు ఉత్సాహంగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,200 మార్కుకు పైన ట్రేడవుతోంది. ఉదయం 9.50 గంటలకు, సెన్సెక్స్ 903 పాయింట్లు పెరిగి 77,817.49 వద్ద, నిఫ్టీ 270 పాయింట్లు పెరిగి 24,267.60 వద్ద ఉన్నాయి.
