
DNews: May02: అమరావతి అద్దాల మీద ఉన్నంత ప్రేమ చంద్రబాబుకు ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నాయకుడు విడదల రజినీ తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కనీసం ఒక్క కొత్త పింఛను అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలో రజినీ మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు పైబడిన వారందరికీ ఇచ్చిన పింఛను హామీ కూడా గాలిలో కలిసిపోయిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన వారికి సుమారు 66 లక్షల 35 వేల పింఛన్లు ఇచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పింఛన్లను తగ్గించారని ఆరోపించారు.
