DNews: Apr 30: హైదరాబాద్‌లోని కాచిగూడ బస్ టెర్మినల్ వద్ద “అమ్మవోడీ” తల్లిపాలను అందించే కేంద్రాన్ని, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బాలల దత్తత కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కలేరు వెంకటేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇందుకోసం ఐసీడీసీని సంప్రదించాలని సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చిన్నారుల తల్లులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజా ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో తల్లిపాలను అందించే కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, శిశు సంక్షేమ శాఖ అధికారులు, రైల్వే అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana