
DNews: Apr 30: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అరుదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారిపై ఈ శస్త్రచికిత్స జరిగింది. 10 కిలోల బరువున్న ఆ బాలుడికి తండ్రి కాలేయంలోని ఒక భాగాన్ని తీసి ప్రతిరోపించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స 14 గంటలపాటు కొనసాగింది. ఆరొగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియా వైద్యుల బృందాన్ని అభినందించారు.
