Fuel woes in AP..no stock boards at banks, problems for motorists-DTv Telangana

DNews: Apr27: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తగ్గుముఖం పట్టడం లేదు. కొన్ని చోట్ల ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెంలో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వాహనదారులు పెట్రోల్ బంకులకు వెళ్లి వెనుదిరగాల్సి వస్తోంది. ప్రధానంగా డీజిల్‌కే డిమాండ్ ఉంది. పెట్రోల్ అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ట్రాక్టర్లు, లారీలు క్యూలో నిలిచాయి. కొందరు క్యాన్లతో నిలబడి ఉన్నారు. విజయవాడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల నిర్వాహకులు పరిమిత పరిమాణంలోనే పెట్రోల్ నింపుతున్నారు. వాహనదారులు సుదూర ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నాలుగు పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగితే తప్ప పెట్రోల్ సరిపోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్, మొగల్‌రాజపురం, బెంజీ సర్కిల్, బీఆర్‌టీఎస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూర్ నియోజకవర్గాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. స్టాక్ లేకపోవడంతో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. చీరాలలో కేవలం రెండు చోట్ల మాత్రమే పెట్రోల్ లభిస్తుండటంతో వాహనదారులు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. తాము ఇంధన కొరతను ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి ఇంధనం కొనవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana