
DSports: Apr16: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించారు. 24 ఏళ్ల ఈ చెన్నై స్టార్ ప్రతిష్టాత్మక ఫిడే కాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నారు. తద్వారా, కాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఈ విజయంతో, ‘చెస్ యువరాణి’గా మారిన వైశాలి, ఛాలెంజర్ హోదాలో ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ వెన్జున్తో తలపడేందుకు అర్హత సాధించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వేదిక, తేదీలను ఫిడే ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
