
DNews: Mar18: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక. ఏపీలోని అనేక జిల్లాల్లో ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడైంది. ముఖ్యంగా పోలవరం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి వంటి జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండగా, అనంతపురం జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తోంది.
