Adarsh ​​School surprise inspection: Headmaster suspended-DTv Telangana

DNews: Mar17: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. భోజ‌నం ఎలా ఉంద‌ని విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఇటీవల, పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం బాగోలేదని ప్రధానోపాధ్యాయుడు జాన్ ఆరోపించారు. ఆ భోజనం బాగోలేదని విద్యార్థులు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు కూడా ముందుగా ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. మంత్రి తనిఖీలు, విద్యార్థుల సమాధానాల తర్వాత, ప్రధానోపాధ్యాయుడు జాన్ పిల్లలతో నాటకం ఆడి, మధ్యాహ్న భోజనంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారని వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana