
DET:MAR 17:
వివాదం నేపథ్యం:
ఇటీవల TVK పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు రజనీకాంత్‌ను ఉద్దేశించి కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం వెనుక కొన్ని అదృశ్య శక్తుల ఒత్తిడి ఉందని ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.విజయ్ రాజకీయ ఎంట్రీని రజనీకాంత్ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం లేదనేది ఆ ఆరోపణల సారాంశం.
రజనీకాంత్ రియాక్షన్:
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా రజనీకాంత్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు.వారు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదు.అవన్నీ అవాస్తవాలు అని ఆయన కొట్టిపారేశారు.నిశ్శబ్దమే సమాధానం నేను ప్రతిదానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.దీనికి కాలమే సమాధానం చెబుతుంది అని ముగించారు.
రాజకీయ వర్గాల్లో చర్చ:
విజయ్ మరియు రజనీకాంత్ మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ వారి అభిమాన సంఘాల మధ్య మరియు పార్టీల మధ్య ఈ కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
