
DET:MAR 16:
నటకిరీటి ధనుష్ తన తదుపరి చిత్రం కార తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సినిమా నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ వాయా ఏయ్ కరసామి తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
పాట విశేషాలు:
మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాటకు అదిరిపోయే ఫోక్ బీట్స్ అందించారు.ధనుష్ – జి.వి. ప్రకాష్ కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ హిట్స్ గ్యారెంటీ ఈ పాట మరోసారి అది నిరూపించింది.ఈ పాటను ధనుష్ స్వయంగా పాడారు.ఆయన తనదైన శైలిలో,లోకల్ స్లాంగ్‌తో పాడటం పాటకు పెద్ద అసెట్ అని చెప్పాలి.సాహిత్యం అరుణ్ రాజా కామరాజ్ అందించిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి.
ఫ్యాన్స్ రియాక్షన్:
పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది.ధనుష్ ఫ్యాన్స్ ఈ సాంగ్‌పై ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు
ధనుష్ మాస్ ఎనర్జీ అదిరిపోయింది.. డ్యాన్స్ రీల్స్ లోడ్ అవుతున్నాయి! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.జి.వి.ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు డప్పుల శబ్దం ధియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సినిమా గురించి:
విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.పోర్ తొళిల్ వంటి క్రైమ్ థ్రిల్లర్ తర్వాత విఘ్నేష్ రాజా చేస్తున్న సినిమా కావడంతో కార పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో మమిత బైజు ప్రేమలు ఫేమ్ హీరోయిన్గా నటిస్తోంది.
