
DET:MAR 16:
ఒత్తిడి మరియు కన్నీళ్లు:
లావణ్య ఒక తమిళ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే దర్శకుడి ప్రవర్తన తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె తెలిపారు.ఆయన ప్రవర్తన నచ్చక నేను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.కానీ వారు నన్ను వదలలేదు.ఆ ఒత్తిడి భరించలేక నేను చాలా ఏడ్చాను అని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు.
నో చెప్పినందుకు లీగల్ కేసు:
తాను సినిమా చేయనని ఖచ్చితంగా చెప్పడంతో సదరు దర్శకుడు ఆమెపై చట్టపరమైన చర్యలకు దిగారు.నేను నో చెప్పినందుకు నాపై కేసు ఫైల్ చేశారు.కెరీర్ మొదట్లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం నన్ను చాలా కుంగదీసింది.కేవలం నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వారు అలా ప్రవర్తించారు అని ఆమె పేర్కొన్నారు.
కుటుంబం మరియు మెగా ఫ్యామిలీ మద్దతు:
ప్రస్తుతం మెగా కోడలిగా ఉన్న లావణ్య ఈ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు తనకు అండగా నిలబడే కుటుంబం ఉందని ఇలాంటి వేధింపులను ఎదుర్కొనే ధైర్యం తనకు వచ్చిందని చెప్పారు.సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
