DET:MAR 14:
ఘటన నేపథ్యం:
హైదరాబాద్‌లో జరిగిన కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ పురస్కారాల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత నటుడు కాంతారావు గారి గొప్పతనాన్ని వివరిస్తూ.. ఆయన జానపద చిత్రాలలో నటిస్తుంటే అప్పట్లో ఎంజీఆర్ కూడా భయపడేవారని కాంతారావు నటన చూసి ఎంజీఆర్ ప్యాంటు తడిపేసుకునేవారు అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

తమిళ చిత్ర పరిశ్రమ ఆగ్రహం:

ఈ వ్యాఖ్యలపై తమిళ నటులు మరియు ఎంజీఆర్ అభిమానులు మండిపడ్డారు.ముఖ్యంగా నటుడు విశాల్ నడిగర్ సంగం అధ్యక్షుడు నాజర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒక లెజెండరీ లీడర్‌ను ఉద్దేశించి అలాంటి పదజాలం వాడటం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ వివరణ మరియు క్షమాపణ:

వివాదం ముదరడంతో రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.అనుకోకుండా దొర్లిన మాట సరదాగా మాట్లాడే క్రమంలో ఎంజీఆర్ గారి గురించి ఒక మాట అనుకోకుండా దొర్లింది.ఆయన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు.నేను మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు ఆయనే సీఎంగా ఉండేవారు.మా ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేవారు.ఆయనంటే నాకు ఎంతో గౌరవం.నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను .ఇకపై ఇలాంటి మాటలు నా నోటి నుంచి రావు అని హామీ ఇచ్చారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana