
DET:MAR 14:
పెళ్లయిన కొద్దిరోజులకే నటి రష్మిక మందన్నకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గతంలో ఆమెకు జరిగిన ఒక బ్రేకప్‌కు సంబంధించిన ప్రైవేట్ చాట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై రష్మిక తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రష్మిక ప్రైవేట్ చాట్ లీక్: పరువు నష్టం దావాకు సిద్ధమైన నటి!
విజయ్ దేవరకొండతో వివాహం జరిగి ఆ సంతోషంలో ఉన్న రష్మికకు ఈ లీక్డ్ చాట్ వ్యవహారం తీవ్ర అసహనాన్ని కలిగించింది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక బ్రేకప్ గురించి సన్నిహితులతో జరిపిన సంభాషణలు అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగింది?
వివాహం తర్వాత రష్మిక తన వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటున్న తరుణంలో కొందరు కావాలనే ఆమె పాత సంబంధాల గురించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ చాట్ బయటకు వచ్చింది. అయితే ఆ చాట్ అసలైనదా లేక ఎవరైనా కావాలని క్రియేట్ చేసినదా అనే దానిపై స్పష్టత లేదు.
లీగల్ యాక్షన్ వార్నింగ్:
తన ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై రష్మిక యుద్ధం ప్రకటించారు. దీనిపై ఆమె టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఇలా పేర్కొంది.ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించకుండా ఇలాంటి ప్రైవేట్ సంభాషణలను లీక్ చేయడం నేరం. ఇది కేవలం పరువు తీయడమే కాకుండా ఒక మహిళా ప్రైవసీని ఉల్లంఘించడమే.బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
సైబర్ క్రైమ్ దృష్టికి..
ఇప్పటికే లావణ్య త్రిపాఠి వంటి నటీమణులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో రష్మిక కూడా తన ప్రైవేట్ చాట్ లీక్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.తన లీగల్ టీమ్ ద్వారా ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం.
