DSports 12Mar 2026:దుబాయ్: క్రికెట్ ప్రపంచంలో మరోసారి ఫిక్సింగ్ భూతం కలకలం సృష్టించింది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేవన్ సీర్లెస్‌ పై అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతడిని తక్షణమే అన్ని రకాల క్రికెట్ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

  • 2023-24 సీజన్‌లో బార్బడోస్‌ వేదికగా జరిగిన బీమ్10 టోర్నమెంట్‌లో సీర్లెస్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఐసీసీ విచారణలో తేలింది. మ్యాచ్ ఫలితాలను లేదా మ్యాచ్‌లోని కొన్ని అంశాలను ప్రభావితం చేసేలా వ్యవహరించినట్లు అతడిపై ప్రధానంగా నాలుగు ఆరోపణలు నమోదయ్యాయి.
  • జేవన్ సీర్లెస్‌ గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడారు. 2018 సీజన్‌లో కేకేఆర్ తరపున బరిలోకి దిగిన ఈ ఆల్ రౌండర్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ సుపరిచితుడు. ఒకప్పుడు ఐపీఎల్ వంటి భారీ వేదికలపై మెరిసిన ఆటగాడు ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
  • ఇదే టోర్నమెంట్‌కు సంబంధించి జనవరిలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్‌ పై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతను సస్పెండ్ అయ్యారు. దీనివల్ల అతను ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026కు కూడా దూరం కావాల్సి వచ్చింది. వరుసగా ఆటగాళ్లు ఇలా పట్టుబడటం వెస్టిండీస్ మరియు అమెరికా క్రికెట్ బోర్డులకు ఇబ్బందికరంగా మారింది.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana