
DSports 11Mar 2026:ముంబై: మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించి భారత్‌కు ప్రపంచకప్ అందించిన స్టార్ క్రికెటర్ శివమ్ దూబే, స్టేడియం బయట కూడా ఒక ‘సాహసమే’ చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజీలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించిన కొద్ది గంటలకే, అభిమానుల కంట పడకుండా ఆయన అత్యంత గోప్యంగా రైలు ప్రయాణం చేసి ముంబై చేరుకున్నారు.
- మార్చి 8న అహ్మదాబాద్‌లో టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. అయితే తన ఇద్దరు పిల్లలను (కుమారుడు అయాన్, కుమార్తె మెహవిష్) త్వరగా చూడాలనే ఆరాటంతో దూబే వెంటనే ముంబై బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ, అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని విమానాలు ఫుల్ అయిపోవడంతో, ఆయనకు రైలు ప్రయాణం మినహా మరో మార్గం లేకపోయింది.
- గుర్తుపట్టకుండా దూబే మాస్టర్ ప్లాన్:
ఒక స్టార్ క్రికెటర్ సాధారణ రైలులో ప్రయాణిస్తే జనం గుమిగూడతారని భయపడిన దూబే, తన భార్య అంజుమ్ ఖాన్ మరియు ఒక స్నేహితుడితో కలిసి ఒక ప్లాన్ వేశారు. - వేషధారణ: ఎవరికీ అనుమానం రాకుండా తలకు క్యాప్, ముఖానికి మాస్క్, ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్ ధరించారు.
- ఎంట్రీ: రైలు కదలడానికి కేవలం 5 నిమిషాల ముందు వరకు ప్లాట్‌ఫారమ్ మీదకు రాకుండా కారులోనే వేచి ఉన్నారు. చివరి నిమిషంలో సయాజీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి నేరుగా తన బర్తులోకి వెళ్లిపోయారు.
- థర్డ్ ఏసీలో ప్రయాణం: లగ్జరీ ఫస్ట్ క్లాస్ కాకుండా సాధారణ థర్డ్ ఏసీ (3rd AC) కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్న దూబే, లోపలికి వెళ్లగానే అప్పర్ బెర్తు ఎక్కేసి దుప్పటి కప్పుకుని ముఖం దాచుకున్నారు.
