DNews: Mar 09: సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు బంధు పథకాన్ని మూసివేసి కొత్తగా “రాహుల్‌ బంధు” పథకాన్ని తెచ్చారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.1,000 కోట్లను కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి పంపుతున్నారని ఆరోపించారు. తన పదవి కాపాడుకోవడానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విధంగా డబ్బులు చెల్లిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేటీఆర్‌ సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ, “ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా?” అని ప్రశ్నించారు. రైతు బంధు మూడో పంటకు చెల్లించాల్సిన బకాయిలు మూడు నెలలుగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు నిజమే అయితే, లక్షల కోట్లతో ప్రాంతాలను అందంగా మార్చమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. రైతు బంధుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వికలాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం దారుణమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వగృహం, ఆయన సోదరుడి ఇల్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిపై చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల అమలుపై కూడా కేటీఆర్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు, కానీ వెయ్యి రోజులు పట్టినా సాధ్యం కాదు” అని విమర్శించారు.
అలాగే, అమ్మాయిల పెళ్లికి ఒక తులం బంగారం, రైతులకు పంట బోనస్‌, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న హామీలను నేరుగా ప్రశ్నించారు. ఈ హామీలు అమలు చేయడం అసాధ్యమని కేటీఆర్‌ తీవ్రంగా విమర్శించారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana