DNews: Mar 09: హైదరాబాద్‌లోని వనస్థలిపురం హరినవనస్థలి పార్క్‌లో ఉన్న అనన్య రిసార్ట్‌ను తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిసార్ట్ నిర్వహణపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత పది సంవత్సరాలుగా ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చినప్పటికీ ఒక్కసారి మాత్రమే ప్రభుత్వానికి పన్నులు చెల్లించారని ఆమె ప్రశ్నించారు. రిసార్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వలేదని కూడా ఆమె ఆరా తీశారు. టాయిలెట్లు, స్విమ్మింగ్‌పూల్, కాటేజీలు, వంటగది వంటి సౌకర్యాలు సరిగా నిర్వహించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రెండు నెలల్లో ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana