
DNews: Mar 07: తెలంగాణ రాజకీయాల్లో గత సంవత్సరం నుంచి చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేలు పార్టీ మార్పు (డిఫెక్షన్) అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. శనివారం అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అర్హత రద్దు పిటిషన్లపై తుది విచారణను ముగించారు. ఈ కేసులపై తీర్పు ఇవ్వడానికి సుప్రీం కోర్టు విధించిన గడువు ఈరోజుతో ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ కార్యాలయంలో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంలో స్పీకర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేలతో ప్రశ్నలు జరిపి, వారిలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులపై తీర్పును రిజర్వ్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ కేసుల విచారణ కూడా ముగిసిందని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.
