
D Spiritual: Feb 28: తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయం
డెకాయిట్ చిత్రబృందం తిరుమల దర్శనం
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‘డెకాయిట్’ చిత్ర బృందం శనివారం ఉదయం దర్శించుకుంది. ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీఐపీ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
విజయం కోసం స్వామివారి ఆశీస్సులు
త్వరలో విడుదల కానున్న తమ చిత్రం ‘డెకాయిట్’ విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్రబృందం స్వామివారి ఆశీస్సులు తీసుకుంది. అడివి శేష్, మృణాల్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడంతో కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.
ప్రమోషన్లలో వేగం
ఏప్రిల్ 10న విడుదల కానున్న ‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవల వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంను దర్శించిన అడివి శేష్, నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది.
