DNational 27 Feb: సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిని చేపట్టాల్సిన విద్యార్థులు దారి తప్పి దొంగలుగా మారిన ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన (Chain Snatching) కేసులో హల్ద్వానీలోని సుశీల తివారీ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని పిథోరఘర్ జిల్లా, మున్స్యారీ ప్రాంతంలోని తోలి గ్రామానికి చెందిన మమతా దేవి అనే మహిళ తన పొలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువతీ యువకులు, తమ ఫోన్‌లో సిగ్నల్ రావడం లేదని, ఒకసారి ఫోన్ ఇవ్వాలని ఆమెను అడిగారు. ఆమె ఫోన్ ఇస్తుండగా, ఒక్కసారిగా ఆమె మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కొని బైక్‌పై పరారయ్యారు.

పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి:

సన్నీ సింగ్ (25): ఢిల్లీకి చెందిన ఈ యువకుడు హల్ద్వానీ మెడికల్ కాలేజీలో MBBS థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

హిమానీ బోరా (23): హల్ద్వానీకి చెందిన ఈ యువతి పారామెడికల్ (రేడియాలజీ) విద్యార్థిని.

బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గౌరీ నది వంతెన వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ వారిని గుర్తించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వీరు ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

By Adhitya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana