DET:FEB 27:
వైష్ణవి చోడిశెట్టితో షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్:
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో V అనే అక్షరాన్ని చూపిస్తూ ఊరిస్తున్న షన్నూ ఎట్టకేలకు ఆ రహస్యాన్ని వీడారు.ఫిబ్రవరి 25 2026న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తూ తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పంచుకున్నారు.

గాడ్స్ ప్లాన్ రివీల్డ్:

షణ్ముఖ్ తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలకు షణ్ముఖ్ జస్వంత్ ,వైష్ణవి చోడిశెట్టి – ఎంగేజ్డ్.. గాడ్స్ ప్లాన్ రివీల్డ్ అంటూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.గతంలో కొన్ని వ్యక్తిగత ఒడిదుడుకులను ఎదుర్కొన్న షన్నూ ఇప్పుడు తన జీవిత భాగస్వామిని పరిచయం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ వేడుకలో ఇద్దరూ బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నారు.

ఎవరీ వైష్ణవి చోడిశెట్టి?
షన్నూ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి వైష్ణవి చోడిశెట్టి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి అని తెలుస్తోంది.వీరిద్దరికీ గత కొంతకాలంగా పరిచయం ఉందని అది ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల సమక్షంలో నిశ్చితార్థానికి దారితీసిందని సమాచారం. వైష్ణవి చూడటానికి ఎంతో సాంప్రదాయబద్ధంగా అందంగా ఉండటంతో “కుందనపు బొమ్మలా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయోమయానికి తెర – ఆశీర్వదించిన అభిమానులు:
గతంలో దీప్తి సునైనాతో విడిపోయిన తర్వాత షన్నూ మళ్ళీ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? లేదా? అన్న చర్చ అభిమానుల్లో ఉండేది.ఇప్పుడు వైష్ణవితో నిశ్చితార్థం జరగడంతో ఆ చర్చలన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.తోటి యూట్యూబర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు వేలాది మంది అభిమానులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.వీరి వివాహం త్వరలోనే గ్రాండ్‌గా జరిగే అవకాశం ఉంది.