DET:FEB 26:
ఉదయపూర్‌లో మొదలైన సంబరాలు:
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాక్డ్ కపుల్ ఎవరంటే అందరూ విజయ్ దేవరకొండ,రష్మిక పేర్లే చెబుతారు.వీరిద్దరూ కలిసి మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.అయితే రీసెంట్‌గా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఒక గ్రాండ్ సంగీత్ ఈవెంట్‌లో ఈ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ప్యాలెస్ సెట్టింగ్‌లో రాయల్ లుక్‌లో వీరిద్దరూ మెరిసిపోతుంటే అక్కడ ఉన్నవారంతా ఫిదా అయిపోయారు.

నింగిని తాకిన బాణసంచా వెలుగులు:
ఈ సంగీత్ వేడుకలో అసలైన హైలైట్ ఏంటంటే.. అక్కడ ఏర్పాటు చేసిన గ్రాండ్ ఫైర్ షో.ఉదయపూర్ ఆకాశం మొత్తం రంగురంగుల బాణసంచా వెలుగులతో నిండిపోయింది.విజయ్,రష్మిక స్టేజ్ మీద ఉన్న సమయంలోనే ఈ ఫైర్ వర్క్స్ జరగడంతో ఆ దృశ్యం చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదు.అక్కడ ఉన్న గెస్టులందరూ తమ ఫోన్లలో ఈ అద్భుతమైన సీన్‌ని బంధించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అదిరిపోయిన విజయ్,రష్మికల కెమిస్ట్రీ:

ఎప్పటిలాగే విజయ్ తన స్వాగ్‌తో,రష్మిక తన క్యూట్ స్మైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.వీరిద్దరూ కలిసి డ్యాన్స్ ఫ్లోర్ మీద సందడి చేయడమే కాకుండా ఒకరితో ఒకరు ముచ్చట్లు పెడుతూ కెమెరాలకు చిక్కారు.ఈ జోడీ మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా లేక అంతకు మించిన రిలేషన్ ఏమైనా ఉందా? అని మరోసారి చర్చలు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్‌డేట్స్:

ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు,వీడియోలు బయటకు రావడమే ఆలస్యం.. నిమిషాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.రౌడీ స్టార్ అభిమానులు ఈ విజువల్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.అసలే ఉదయపూర్ అంటేనే రాయల్టీకి కేరాఫ్ అడ్రస్ అలాంటి చోట విజయ్-రష్మిక కలిసి కనిపించడంతో ఈ వేడుక మరింత గ్రాండ్‌గా మారిపోయింది.ఇద్దరూ కలిసి త్వరలోనే ఒక మంచి సినిమాతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.