
DNews: Feb25: శ్రీకాకుళం డయేరియా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తమైంది. ఒకేసారి 76 మంది ఆస్పత్రి పాలవ్వడం, వారిలో ఎనిమిదిమంది వెంటిలేటర్ పై ఉండగా నలుగురు మృతి చెందారు . ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా రియాక్టైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో డయేరియా ప్రబలడం వెనుక మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న కూర్మారావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
