DET:FEB 25:
ధావన్‌కు అనుకూలంగా ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు:
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ షికార్ ధావన్‌కు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో పెద్ద ఊరట లభించింది.ధావన్ తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి గతంలో సెటిల్మెంట్ కింద ఇచ్చిన భారీ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.వీరిద్దరి విడాకుల వ్యవహారం ఇప్పటికే చర్చనీయాంశం కాగా ఈ తాజా తీర్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మోసం మరియు ఒత్తిడిపై కోర్టు ఆగ్రహం:

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అయేషా ముఖర్జీ అనుసరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు.ధావన్ నుంచి డబ్బు వసూలు చేసే క్రమంలో ఆమె కోయెర్షన్ మరియు ట్రిక్కరీ ఉపయోగించిందని కోర్టు నిర్ధారించింది.బలవంతంగా లేదా తప్పుదోవ పట్టించి తీసుకున్న డబ్బు చట్టబద్ధం కాదని ధావన్ తరుపు లాయర్లు వాదించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది.

సెటిల్మెంట్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఆదేశం:
ధావన్ తన ఆస్తుల్లో కొంత భాగాన్ని ఆస్ట్రేలియాలో ఉన్న అయేషా పేరు మీద మరియు ఆమె పిల్లల పేరు మీద గతంలో రాశారు. అయితే ఆ సమయంలో ఆమె ధావన్‌ను మానసిక ఒత్తిడికి గురిచేసిందని కోర్టు గుర్తించింది.అందుకే సెటిల్మెంట్ రూపంలో తీసుకున్న ఆ అదనపు మొత్తాన్ని వెంటనే ధావన్‌కు తిరిగి చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.ఇది ధావన్‌కు నైతికంగా కూడా పెద్ద విజయమని అభిమానులు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఆస్తుల వివాదం:

అయేషా ముఖర్జీకి గతంలోనే పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ధావన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఆస్ట్రేలియాలోనే ఉంటూ ధావన్ సంపాదించిన డబ్బుతో అక్కడ విలాసవంతమైన ఆస్తులు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి.భారత్‌లో ఉంటున్న ధావన్‌ను తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఆమె ప్రయత్నించిందని చివరకు విడాకుల సమయంలో కూడా అనైతిక పద్ధతులు వాడుకుందని కోర్టు వ్యాఖ్యానించింది.