DET:FEB 21:
ప్రోమో విడుదల తేదీ మరియు సమయం:
రజనీకాంత్ మరియు కమల్ హాసన్ మళ్లీ కలిసి నటిస్తున్నారన్న వార్త విన్నప్పటి నుండి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను ఫిబ్రవరి 21,2026న మధ్యాహ్నం 12:07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సమయాన్ని ఎంచుకోవడంలో ఒక ప్రత్యేకత ఉందని ఇది సినీ ప్రియులకు ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సరికొత్త పోస్టర్‌తో పెరుగుతున్న అంచనాలు:
రెడ్ జైయంట్ మూవీస్ సంస్థ ఈ సినిమా అప్‌డేట్‌ను ప్రకటిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది.ఇందులో ఒక వింటేజ్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారుతో పాటు కొంతమంది వ్యక్తులు రూల్స్ పెడతారు.మరికొంతమంది ఆ రూల్స్‌ను ఏలుతారు అనే ట్యాగ్‌లైన్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.ఈ పోస్టర్‌లో ఇద్దరు లెజెండ్స్ ముఖాలు చూపించకుండా కేవలం సంకేతాలతోనే హైప్ క్రియేట్ చేశారు.

దర్శకత్వం మరియు సంగీతం:
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు.జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నెల్సన్ ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్లను ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.నెల్సన్-అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చే మాస్ ఎలివేషన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

40 ఏళ్ల తర్వాత అద్భుతం:
కమల్ హాసన్,రజనీకాంత్ చివరిగా 1985లో వచ్చిన గిరఫ్తార్ చిత్రంలో కలిసి కనిపించారు.ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు వెండితెరపై వీరిద్దరినీ చూడబోతుండటం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.