
DSports 21Feb 2026: నేటి నుంచి (ఫిబ్రవరి 21) అసలైన అసలు సిసలైన పోరు మొదలవుతోంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన టాప్-8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీపడనున్నాయి. కొలంబో వేదికగా నేటి రాత్రి 7 గంటలకు తొలి పోరు జరగనుంది. అయితే కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ శనివారం రాత్రి 7 గంటలకు జరగనుంది.
- ఆస్ట్రేలియాకు షాక్: మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా లీగ్ దశలోనే నిష్క్రమించడం ఈ టోర్నీలో అతిపెద్ద సంచలనం. జింబాబ్వే చేతిలో ఓటమి పాలవ్వడం వారి కొంపముంచింది.
- జింబాబ్వే సంచలనం: పసికూనగా భావించిన జింబాబ్వే, ఆస్ట్రేలియా మరియు ఆతిథ్య శ్రీలంక వంటి జట్లను ఓడించి టేబుల్ టాపర్‌గా సూపర్-8లోకి దూసుకొచ్చింది.
- భారత్ జోరు: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా లీగ్ దశలో పాకిస్థాన్‌తో సహా అన్ని జట్లపై విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగనుండగా, గ్రాండ్ ఫైనల్ మార్చి 8న నిర్వహించనున్నారు.
