
DET:FEB 20:
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి క్రేజీ కాంబో:
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ తన షూటింగ్ షెడ్యూల్స్ సర్దుబాటు చేసుకుంటూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
సురేందర్ రెడ్డి సెంటిమెంట్:
సాక్షి వైద్యను సురేందర్ రెడ్డి తన ఏజెంట్ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం చేశారు.ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా సాక్షి నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల సురేందర్ రెడ్డికి మంచి నమ్మకం ఉంది.అందుకే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం మరోసారి ఆమెకే అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలో షూటింగ్ ప్రారంభం:
ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.మార్చిలో ఉగాది పర్వదినం సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు.
అభిమానుల నిరీక్షణ:
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కోసం సిద్ధమవుతుండగా సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్ రావడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.సాక్షి వైద్యకు ఇది కెరీర్ పరంగా పెద్ద మలుపు కానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
