
DNews: Feb 20: జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టాటిపర్తి జీవన్ రెడ్డి గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు చురుకుగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం చైర్మన్ ఎంపికలో ఎమ్మెల్యే సంజయ్ వర్గం మరియు జీవన్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని చైర్మన్ పదవిని సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవిని జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. పార్టీ కార్యకర్తలు ఆయన అనారోగ్యానికి కారణంగా సమయానికి భోజనం చేయకపోవడం, వాతావరణ మార్పులు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
