
DET:FEB 19:
అమితాబ్ బచ్చన్ ఇచ్చిన స్ఫూర్తి:
అభిషేక్ బచ్చన్ తన పెట్టుబడి ప్రయాణం వెనుక తండ్రి అమితాబ్ బచ్చన్ ప్రభావం ఎంతగానో ఉందని చెప్పారు.అమితాబ్ కేవలం నటుడిగానే కాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని వ్యాపార ధోరణులను అందిపుచ్చుకుంటారని అభిషేక్ తెలిపారు.మా నాన్న ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఆయన ఆలోచనా విధానమే నన్ను కూడా కొత్త రంగాల్లోకి అడుగుపెట్టేలా చేసింది అని ఆయన పేర్కొన్నారు.
స్విగ్గీలో పెట్టుబడికి కారణం:
నేటి కాలంలో ఆహార పంపిణీ రంగం ఎంత వేగంగా ఎదుగుతుందో మనందరికీ తెలిసిందే.స్విగ్గీ వంటి సంస్థలు సామాన్యుల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయని అభిషేక్ అభిప్రాయపడ్డారు.కేవలం లాభాల కోసం మాత్రమే కాకుండా ప్రజల అవసరాలను తీరుస్తూ నిత్యం వృద్ధి చెందే వ్యాపారం కావడంతోనే ఆయన స్విగ్గీలో వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం.ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన నమ్ముతున్నారు.
నాగిన్ సాస్ ఎంచుకోవడానికి వెనుక కథ:
సాధారణంగా సెలబ్రిటీలు పెద్ద పెద్ద బ్రాండ్లలో పెట్టుబడులు పెడతారు కానీ అభిషేక్ నాగిన్ సాస్ వంటి దేశీయ బ్రాండ్‌ను ఎంచుకోవడం విశేషం.దీని గురించి మాట్లాడుతూ భారతీయ రుచులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.నాగిన్ సాస్ వంటి స్టార్టప్‌లు మన స్వదేశీ రుచులను ఆధునిక పద్ధతిలో అందిస్తున్నాయి అని చెప్పారు.ఒక వినూత్నమైన ఆలోచనతో వస్తున్న చిన్న కంపెనీలను ప్రోత్సహించడం తనకు ఇష్టమని ఆయన వెల్లడించారు.
భవిష్యత్తు ప్రణాళికలు మరియు వ్యాపార దృక్పథం:
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా స్పోర్ట్స్ ప్రో కబడ్డీలో జైపూర్ పింక్ పాంథర్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో అభిషేక్ చురుగ్గా ఉంటున్నారు.పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థ యొక్క విజన్ మరియు అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాలను తాను గమనిస్తానని ఆయన స్పష్టం చేశారు.తండ్రి నేర్పిన క్రమశిక్షణ దూరదృష్టితోనే తాను ఈ వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అభిషేక్ వివరించారు.
