DSports 19Feb 2026:అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన భారత్, ఎలాంటి ఓటమి లేకుండా సూపర్-8 రౌండ్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది.

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్ (18) కూడా త్వరగానే వెనుదిరగడంతో భారత్ 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, ఆరంభంలో ఆచితూచి ఆడినా తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు.
  • అతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31), హార్దిక్ పాండ్యా (30) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193/6 భారీ స్కోరు సాధించింది.