
DSports 19Feb 2026:అహ్మదాబాద్: టీమిండియా యువ సెన్సేషన్, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ కావడంతో, ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి ‘సున్నా’కే పెవిలియన్ చేరినట్లయింది. దీంతో ఐసీసీ మెగా టోర్నీలో హ్యాట్రిక్ డకౌట్స్ అయిన రెండో భారత ఆటగాడిగా (గతంలో ఆశిష్ నెహ్రా) అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
- ఈ వరుస వైఫల్యాలతో అభిషేక్ శర్మ కొన్ని అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఒకే క్యాలెండర్ ఇయర్ (2026)లో అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు డకౌట్ అయి, సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్ ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 3 సార్లు డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడినా, ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం విశేషం.
- వరుసగా సున్నాలు చుడుతుండటంతో టీమ్ మేనేజ్మెంట్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడే క్రమంలో అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు, కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని, ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
