
DSports 19Feb 2026:కొలంబో/అహ్మదాబాద్: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ తన ఆలోచనా విధానాన్ని (Mindset) మార్చుకోవాలని, క్రీజులోకి రాగానే భారీ షాట్లకు ప్రయత్నించడం వల్లే వికెట్ పారేసుకుంటున్నాడని విశ్లేషించారు.
- “అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఒక్కటే.. మొదట ఒక సింగిల్ తీసి ఖాతా తెరువు. అప్పుడే నీ కాళ్లు కదులుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత నీ అసలు సిసలు హిట్టింగ్ గేమ్ ప్రారంభించు” అని గావస్కర్ సూచించారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అదరగొట్టి, నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగిన అభిషేక్.. ఇప్పుడు ఆ అంచనాలను అందుకోవాలనే ఒత్తిడిలో ఉన్నాడని గావస్కర్ అభిప్రాయపడ్డారు. తాను భారీ సిక్సర్ల వీరుడిని అని నిరూపించుకోవాలనే తొందరలో స్మార్ట్ క్రికెట్‌ను మర్చిపోతున్నాడని అన్నారు.
- అభిషేక్ అవుట్ అవుతున్న తీరును గమనిస్తే, అతను చాలా సులభంగా వికెట్ ఇచ్చేస్తున్నాడని, ప్రత్యర్థి బౌలర్లు అతడి దూకుడును ఆసరాగా చేసుకుని బోల్తా కొట్టిస్తున్నారని గావస్కర్ విమర్శించారు.
