Indian stock markets closed with heavy losses.. Nifty below 25,500-DTv Telangana

DNews: Feb13:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు, ఐటీ, మెటల్ స్టాక్‌లలో అమ్మకాలు సూచీలను కుంగదీశాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 25,500 దిగువన ముగిసింది. పెట్టుబడిదారుల సంపద రూ. 7 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బిఎస్‌ఇలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం విలువ రూ. 472.50 లక్షల కోట్ల నుండి రూ. 465.50 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ఉదయం 82,902.73 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది (గతంలో 83,674.92 వద్ద ముగిసింది). రోజంతా నష్టంతో కదిలింది. ఇంట్రాడేలో 82,534.55 కనిష్ట స్థాయిని తాకిన సూచీ.. చివరకు 1048.16 పాయింట్ల నష్టంతో 82,626.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 336.10 పాయింట్లు కోల్పోయి 25,471.10 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90.66 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ మినహా మిగతా అన్ని స్టాక్‌లు నష్టపోయాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఎటర్నల్, టాటా స్టీల్, టైటాన్, టిసిఎస్ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు $67 వద్ద ఉండగా, బంగారం ఔన్సుకు $4977 వద్ద ట్రేడవుతోంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana