DET:FEB 13:
టైటిల్ మార్పు వెనుక ఉన్న అసలు కారణం:
మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ పేరును మార్చాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది.మొదట ఈ చిత్రానికి ఘూస్ ఖోర్ పండిత్ అనే టైటిల్‌ను అనుకున్నారు.అయితే ఈ పేరు వినడానికి కొంత వివాదాస్పదంగా ఉండటం మరియు ఒక నిర్దిష్ట వర్గాన్ని ఉద్దేశించి ఉన్నట్లు అనిపించడంతో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మనోజ్ బాజ్‌పేయి – నీరజ్ పాండే క్రేజీ కాంబో:

నీరజ్ పాండే మరియు మనోజ్ బాజ్‌పేయిలది హిట్ కాంబినేషన్.గతంలో వీరు స్పెషల్ 26,నామ్ షబానా మరియు అయ్యారీ వంటి చిత్రాలతో పాటు సీక్రెట్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ కోసం కలిసి పనిచేశారు.చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం చేతులు కలపడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ సోషల్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం.

కొత్త పేరు పరిశీలనలో ఉంది:

చిత్ర యూనిట్ ప్రస్తుతానికి పాత టైటిల్‌ను పక్కన పెట్టి కథకు సరిపోయే విధంగా ఒక పవర్‌ఫుల్ మరియు సాఫ్ట్ టైటిల్‌ను వెతికే పనిలో పడింది.నెట్‌ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్న సినిమా కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పేరును ఖరారు చేయాలని భావిస్తున్నారు.త్వరలోనే అధికారికంగా కొత్త టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

నేరుగా ఓటిటిలోనే విడుదల:
ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుదల కానుంది.మనోజ్ బాజ్‌పేయి తన సహజ సిద్ధమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారని నీరజ్ పాండే మార్క్ సస్పెన్స్ మరియు డ్రామా ఇందులో పుష్కలంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి బజ్ ఉంది.