DSports 11Feb 2026:న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. యువ షూటర్ ఆకృతి దహియా రజత పతకంతో మెరవగా, వెటరన్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

  • ఫైనల్లో 354.2 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇది ఆమెకు లభించిన తొలి వ్యక్తిగత కాంటినెంటల్ పతకం కావడం విశేషం.రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అంజుమ్ 340.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.కజకిస్థాన్ షూటర్ సోఫియా షుల్‌జెంకో 358.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ విభాగంలోనూ భారత్ రాణించింది. ఆకృతి దహియా, అంజుమ్ మౌద్గిల్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు 1756 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. కజకిస్థాన్ జట్టు స్వర్ణ పతకాన్ని నెగ్గింది.మంగళవారం నాటి పతకాలతో కలిపి ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు సీనియర్ విభాగంలో మొత్తం 18 పతకాలను (8 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అంతకుముందు రోజు మను భాకర్ (25 మీటర్ల పిస్టల్ రజతం), ఇషా సింగ్ (కాంస్యం) కూడా మెరిసిన సంగతి తెలిసిందే.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana